త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం దమ్మపేట మండలం పట్వారిగూడెం చెలికాని ఆదెమ్మ ఫంక్షన్ హాల్ నందు జరిగింది.
ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, జిల్లాల ఏఐసీసీ పరిశీలకులు జాన్సన్ అబ్రహాం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని మరింత పునరుద్ధరించడం కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలనే లక్ష్యంగా దేశవ్యాప్తంగా సంఘటన్ సృజన్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీని చురుకైన నాయకులతో బలోపేతం చేస్తు పార్టీకి కట్టుబడి పనిచేసే SC, ST, BC, మైనారిటీలు, మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కొత్త కమిటీలు ఏర్పాటుచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను ప్రజల దరికి చేరేలా చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమం కేవలం సంస్థాగత మార్పు కాదని ప్రజల సమస్యల పట్ల స్పందించే కాంగ్రెస్ ఉద్యమానికి కొత్త ఊపిరి పోసే ప్రయత్నమని పార్టీ పెద్దలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకి సమయానుకూలంగా గుర్తింపు వస్తుందని ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


