72 మొక్కలు దొంగల ముఠా చేతికి.
స్థానిక నాయకుల సహకారంతో జరిగిన దోపిడీ!
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 15, మండపేట రూరల్, ద్వారపూడి ప్రాంతంలోని వేములపల్లిలో ప్రభుత్వానికి చెందిన చెరువు గట్టుపై ఉన్న మర్రి రావి జాతికి పచ్చని 72 మొక్కలు అక్రమంగా తవ్వి తరలించబడిన ఘటనపై మండపేట రూరల్ కన్వీనర్ అడబాల బాబ్జి తీవ్రంగా ప్రశ్నించారు. ఈ మొక్కలు బంగారమ్మ కాలనీ బ్యాక్ సైడ్‌లోని బృందావనం కాలనీ డీటీసీపీ, లేఔట్‌లోని 36 ప్లాట్లకు సంబంధించినవి. సుమారు 15 సంవత్సరాలుగా ఉన్న ఈ మొక్కలను యజమానులకు తెలియకుండా దుండగుల ముఠా అపహరించింది. స్థానికంగా ఉన్న ఒక నాయకుడి సహకారంతో ఈ అక్రమం జరిగినట్లు ఆరోపించారు .
స్థానిక మహిళ వెలవల భూరమ్మ ఈ ఘటనపై ప్రశ్నించగా, దొంగల ముఠా “మేము హోల్‌సేల్‌గా కొన్నాము” అని ఇరుగుపొరుగు వారితో చెప్పి అక్రమంగా తరలించుకుపోయినట్లు తెలుస్తోంది. కడియం మండలంలోని నర్సరీలకు ఔషధ గుణాలు కలిగిన మర్రి వృక్షాలను లక్షల్లో అమ్ముతూ, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లోని వృక్ష సంపదను విదేశాలకు తరలిస్తున్నారని కూటమి నేతలపై ఆరోపణలు చేసారు. పర్యావరణ రక్షణ పేరుతో ఈ సంపదను దోచుకుంటున్నారని, కూటమి నేతలు ఇందులో పాలుపంచుకుంటున్నారని విమర్శించారు.
ఈ అక్రమాన్ని గుర్తించి ఎంక్వైరీ చేయాలని మండపేట రూరల్ కన్వీనర్ అడబాల బాబ్జి కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ మరియు హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వాల్టా యాక్ట్ (వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్) అనుమతి లేకుండా మొక్కలు నరికితే జరిమానా మరియు జైలు శిక్ష విధించాలన్నారు. ప్రైవేట్ భూముల్లో కూడా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అనుమతి తప్పనిసరి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు, ఫారెస్ట్ మరియు హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌లు ఉమ్మడి దర్యాప్తు చేపట్టాలి. దుండగుల ముఠాను గుర్తించి అరెస్టు చేయాలి, తరలించిన మొక్కలను స్వాధీనం చేసుకోవాలి. కడియం వంటి నర్సరీ ప్రాంతాల్లో రెగ్యులర్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూముల్లోని వృక్షాల తరలింపును నిరోధించడానికి GPS ట్రాకింగ్ మరియు డ్రోన్ సర్వేలు ఉపయోగించాలి.
అక్రమంగా నరికిన మొక్కల విలువకు 10 రెట్లు జరిమానా విధించాలి. దోషులు కొత్త మొక్కలు నాటాలి మరియు పర్యావరణ పునరుద్ధరణకు బాధ్యత వహించాలి. స్థానికులకు వృక్ష సంపద రక్షణపై అవగాహన కల్పించాలి. హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ నర్సరీల లైసెన్స్‌లను కఠినంగా పరిశీలించాలి, విదేశీ ఎగుమతులపై నిఘా పెంచాలి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


