తేదీ : 12/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, వినగడప కట్టలేరు వద్ద శాసనసభ్యులు శ్రీనివాసరావు పత్రికా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది వ సంవత్సరంలో బ్రిడ్జి కూలిపోతే అప్పటినుంచి తాత్కాలిక మరమ్మతుల పేరిట రూపాయలు ఒక కోటి నలబై వచ్చాయని, ఓ న్యూస్ ఛానల్ ల్లో వచ్చినటువంటి కథనం మేరకు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు? కాంట్రాక్టర్ ఎవరు అని , వివరాలు వెల్లడించాలి అని తెలపడం జరిగింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి బ్రిడ్జి కోసం ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించారు. చాలాసార్లు వరద వలన పాడైపోయిన రోడ్డుకు తాత్కాలిక రోడ్డు ను సొంత నిధులతో మరమ్మతులు చేశామని, రానున్న రెండు మూడు నెలల వ్యవధిలోనే ఈ కట్టలేరు వంతెనకు సంబంధించి టెండర్లు ప్రారంభం అవుతున్నాయి అని, వీలైనంత త్వరగా వంతెన పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ మండలానికి సంబంధించిన కూటమి నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


