భాదిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ళ…
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 11. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, సోమేశ్వరం, ఇటీవల రాయవరం శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన సోమేశ్వరం గ్రామానికి చెందిన పాక అరుణ, వాసంశెట్టి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులను శనివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, పరామర్శించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ అనుకోని సంఘటనతో కొన్ని కుంటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయన్నారు. ఇటువంటి సంఘటన దురదృష్టకరం అన్నారు. చనిపోయినవారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుందన్నారు.
ఈ పరామర్శలలో అమలాపురం పార్లమెంట్ ఉపాధ్యక్షులు వై.ఆర్.కె.పరమహంస, సొసైటీ చైర్మన్ శాక కోటేశ్వరరావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు శాక శ్రీనివాస్, రావుల సత్యనారాయణ, అమ్మవరపు సత్యనారాయణ, నీటి సంఘం డైరెక్టర్ పిల్లి వెంకటరమణ, కడియాల వెంకటరమణ, గుత్తుల పవన్ కుమార్, గుత్తుల వీరన్న, చింతపల్లి వెంకటరమణ, దండంగి పైసా దాసు, సరాకుల రాజు, మద్ద రాజు, అనసూరి శ్రీనివాసు, కురుపూడి సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


