సుమారు ఒక కోటి పదకొండు లక్షల రూపాయల విలువ గల 222 కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ మరియు అశ్వారావుపేట పోలీసులు
త్రినేత్రం న్యూస్. ఈ రోజు అనగా తేదీ 11.10.2025 ఉదయం 08:30 గంటల సమయంలో అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని SLT పేపర్ బోర్డు సమీపం లోని జంగారెడ్డి గూడెం రోడ్ నందు విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు అశ్వారావుపేట పోలీసులు వాహన తనిఖిలు చేపట్టగా,అనుమానాస్పదంగా జంగారెడ్డిగూడెం వైపు నుండి అశ్వారావుపేట వైపు నకు పారిపోతున్న swift dzire car ను వెంబడించి కొద్ది దూరంలో ఆపి విచారించగా హైదరాబాద్ కు చెందిన A1)ఊంగరాల సరిన్ కుమార్ (Transporter),A2)బెల్లంపల్లికి చెందిన బాబర్ ఖాన్ (Transporter) లు గా గుర్తించి వారి car లో ఉన్న 222 కిలోల బరువు గల 111 ప్యాక్కెట్ల నిషేదిత గంజాయిని స్వాదినo చేసుకోవడమైనది. A3)విశాఖపట్నం నకు చెందిన పంగి శ్రీను ( Supplier) వద్ద 4 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి, A6)మహారాష్ట్ర రాష్ట్రం నాగపూర్ కు చెందిన ఇంతియాజ్ ( RECEIVER) కు ఎక్కువ మొత్తానికి అమ్మడానికి వెళ్తుండగా పోలీస్ వారు పట్టుకోవడమైనది. స్థానిక సంస్థల ఎన్నికల నేపద్యంలో వాహనాల తనిఖీలు ఎక్కువగా ఉన్నాయని భావించి A1-సరిన్ కుమార్ స్నేహితులైన A-4 హైదరాబాద్ కు చెందిన md. ఫీరోజ్ (pilot ) & A5) హైదరాబాద్ కు చెందిన సంతోష్ (pilot )లు ఇట్టి గంజాయి వాహనానికి innova car ను పైలట్ వాహనంగా గా కూడా పెట్టుకున్నారు.
• గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని చాకచక్యంగా పట్టుకున్న అశ్వారావుపేట పోలీసు అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
పట్టుబడిన నిందితులపై ఆశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో Crime Number.250/2025, Under section : 8(C) r/w 20(b)(ii)(C), 27(A),29 of NDPS యాక్ట్ క్రింద సీఐ నాగరాజు రెడ్డి కేసు నమోదు చేయడం జరిగింది.గంజాయిని తరలించడానికి ఉపయోగించిన వాహనం మారుతి swift dezire కారు నెం : AP 09 BV 5868,మరియు నిందితులు ఉపయోగించిన సెల్ ఫోన్లు/నగదు: రెండు సెల్ ఫోన్ లు, JIO రూటర్ మరియు, Rs.4000 రూపాయల నగదును కూడా స్వాదీనం చేసుకోవడం జరిగింది.ఇద్దరు నిందితులు అరెస్ట్ చేయడమైనది,మరో నలుగురు పరారీలో వున్నారు.అరెస్ట్ అయినవారిలో A1 పై గతములో రెండు NDPS కేసులు కూడా కలవు.
పట్టుబడిన నిందితుల వివరములు
A1). హైదరాబాద్ కు చెందిన ఊంగరాల సరిన్ కుమార్ (Transporter)
A2). బెల్లంపల్లి కి చెందిన బాబర్ ఖాన్ (Transporter)
పరారీలో ఉన్న నిందితుల వివరములు
A3). విశాఖపట్నం నకు చెందిన పంగి శ్రీను ( Supplier)
A4). హైదరాబాద్ కు చెందిన md. ఫీరోజ్ (pilot )
A5). హైదరాబాద్ కు చెందిన సంతోష్ (pilot )
A6). మహారాస్ట్రా నాగపూర్ కు చెందిన ఇంతియాజ్ (RECEIVER)
వాహన తనిఖీలలో పాల్గొన్న అధికారులు.
టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఎస్సైలు ప్రవీణ్,రామారావు మరియు అశ్వారావుపేట ఎస్సై రామ్మూర్తి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


