తేదీ : 09/10/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రంలో మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి గుడివాడ నియోజవర్గంలో రైతులకు ప్రయోజనం చేకూరేలా , లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఏర్పాటు కు కృషి చేస్తున్నామని శాసనసభ్యులు వెనిగండ్ల. రాము సమీక్షించిన అధికారంతో అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు పంపినట్లు తెలిపారు. రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా, కాలువ లు, డ్రైన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.
డిసెంబర్ నెల లోపు పనులన్నీ పూర్తి చేయాలని సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా వడ్లమన్నూరు, కొమరవోలు, గ్రామాలలోని మేజర్ చానల్స్ మరియు బుడమేరులో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. నిర్మాణానికి అవసరమైన నిధులు చైర్మన్ లీల కృష్ణ అందిస్తామని స్పందించినట్లు శాసనసభ్యులు చెప్పారు. ఈ కార్యక్రమంలో డ్రైనేజీ డి ఈ ఇ లు, నాగేంద్ర కుమార్, శ్రీను, భరత్, ఆ శాఖ ఏఈలు, అనిల్ కుమార్, అరుణ్, లక్ష్మి , నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


