జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలం అట్లవారిపల్లి లో ఉన్న ఈడిగ గౌడ సంఘం నాయకులు ఈరోజు తాసిల్దార్ని కలిసి గౌడ సర్టిఫికెట్లు దుర్వినియోగం జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ తోకల ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మా కులం సర్టిఫికెట్ లేకుండా ఈడిగ బీసీ బి ఇవ్వరాదని చెప్పారు. మా కులస్తులు పెనుమూరు మండలంలో అట్లవారిపల్లి, సన్యాసిపల్లి, సామిరెడ్డిపల్లి, సాతంభాకం, ఊర్లలో ఉన్నారు. వారికి మాత్రమే మా కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎమ్మార్వో కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ గౌడ్, సెక్రెటరీ తోకల కేశవ బాబు గౌడ్, కమిటీ మెంబర్స్ గుణశేఖర్ గౌడ్, పార్థసారధి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gowda Sangam met the Tahsildar

You cannot copy content of this page