తేదీ : 08/10/2025. కోనసీమ జిల్లా : (త్రినేత్రం న్యూస్); రాయవరం స్థానిక బాణాసంచా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది .ఈ దుర్ఘటనలో అందులో పని చేస్తున్నటువంటి ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదానికి గల కారణాలు , సహాయక చర్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని , బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


