Kishore : బి ఆర్ ఎస్ వికారాబాద్ పట్టణ BC సెల్ అధ్యక్షులుగా కిషోర్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ పట్టణంలోని తన నివాసంలో పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో సమావేశమైన వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ . సమావేశం లో భాగంగా నాయకులు కిషోర్ ఎం ఐ జి ను పట్టణ బీసీ సెల్ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ పార్టీ బీసీ రిజర్వేషన్ల అమలులో అనుసరిస్తున్న వైఖరి మరియు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బీసీ లకు చేస్తున్న ద్రోహం వంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఆయన మాట్లాడుతూ.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పెట్టుకుని కాలయాపన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు, తీసుకువస్తున్న ఆర్డినెన్స్‌, బిల్లు, జీవో అన్ని కూడా నాటకాలు. బీసీల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం.ఈ నాటకాలన్నీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో దిట్ట. 42% ఇచ్చిన జీవోను తన అనుచరుల ద్వారా కోర్టు వివాదాల్లోకి లాగి ఎన్నికలను వాయిదా వేయించాలని పక్క ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని బి ఆర్ ఎస్ పార్టీ తరుపున ప్రజలకు వివరించాలి.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మోసాలను, ప్రజల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యాలను ప్రచార ఆస్త్రాలుగా ఉపయోగించుకోవాలి. బీసీ రిజర్వేషన్లు, ఇతరత్రా హామీల అమలు మీద కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలి.భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణపై ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలి.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ మాజీ కౌన్సిలర్ అనంత్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్*, సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, వికారాబాద్ పట్టణ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ రామస్వామి, నాయకులు మంచన్పల్లి సురేష్, పట్టణ జనరల్ సెక్రెటరీ గాండ్ల మల్లికార్జున్, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు సుభాన్ రెడ్డి, పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షులు ముర్తుజా ఆలీ, పట్టణ సోషల్ మీడియా అధ్యక్షులు మల్లేష్, నాయకులు రమణ, వేణుగోపాల్, బూరుగుపల్లి అనంతరెడ్డి, ఫరీద్, నరసింహ, వరుణ్, రాము పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kishore as the president of BRS

You cannot copy content of this page

Scroll to Top