వారిని చంపే ఉద్దేశం లేదన్న అమిత్ షా
Trinethram News : 2026 మార్చి 31 నాటికి భారత్లో పూర్తిగా నక్సలిజాన్ని అంతం చేస్తామని పునరుద్ఘాటన మావోయిస్టుల ఏరివేతపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో నక్సలిజం కేవలం ఆయుధాలతోనే అంతం కాదని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం నక్సలిజం వెనుక ఉన్న సిద్ధాంతాలపై పోరాటం చేయాలని చెప్పారు. ‘ నక్సల్ రహిత భారత్’ పేరిట నిర్వహించిన భారత్ మంథన్ 2025 కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో 2026 మార్చి 31 నాటికి భారత్లో పూర్తిగా నక్సలిజాన్ని అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. మావోయిస్టులు మన దేశ ప్రజలని, వారిని మనమే ఎందుకు చంపాలని వారికి మద్దతు ఇస్తున్న వామపక్షాలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. మాకు వారిని చంపాలనే ఉద్దేశం లేదు. దాదాపు 290 మందికిపైగా ఆయుధాలు పట్టిన వారు హతమయ్యారు. ఇంకా 1,090 మంది అరెస్ట్ అయ్యారు. ఎక్కడైనా అరెస్ట్ చేసే అవకాశం వస్తే తప్పకుండా వారిని అదుపులోకి తీసుకుంటాం. ప్రభుత్వ విధానాలతో 881 మంది సరెండర్ అయ్యారు. నక్సలైట్లు సరెండర్ లేదా అరెస్ట్ చేసేందుకు అన్ని విధాల ప్రయత్నించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వారికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పాం. ఇందుకోసమే నక్సలైట్ల కోసం అద్భుతమైన సరెండర్ విధానాన్ని తీసుకువచ్చాం. అయినా సరే ఆయుధాలు తీసుకుని అమాయకులైన పౌరులను చంపుతుంటే భద్రతా దళాలకు మరో ఆప్షన్ ఉండదు. బుల్లెట్లకు బుల్లెట్లతోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ” అని అమిత్ షా తెలిపారు. మూడు అంతర్గత సమస్యలపై మోదీ ప్రభుత్వం ఫోకస్
అంతర్గత భద్రతపై మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన రికార్డులను అమిత్ షా గుర్తు చేశారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి భారత్ మూడు అంతర్గత సమస్యలతో సతమతమవుతుందని చెప్పారు. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల అంతర్గత సమస్యలతో పాటు వామపక్ష తీవ్రవాదం దేశంలో శాంతికి విఘాతం కలిగించిందని తెలిపారు. “ఈ మూడు సమస్యలు దాదాపు 5 దశాబ్దాలుగా దేశంలో అనేక మంది ప్రాణాలు తీస్తూ శాంతి లేకుండా చేస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ను ఇందుకు కేటాయించాల్సి వచ్చేది. పేద ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన బడ్జెట్ను ఈ సమస్యల పరిష్కారానికి మళ్లించాల్సి వస్తుంది. కానీ మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టాక వీటిని గుర్తించి అనేక చర్యలు తీసుకున్నారు.” అని అమిత్ షా అన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


