డిండి (గుండ్లపల్లీ) సెప్టెంబర్ 28 త్రినేత్రం న్యూస్. అచ్చంపేటలో జరిగే సింహ గర్జన సభకు వెళ్తున్న బి ఆర్ ఎస్ ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు డిండి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు , అభిమానులు అధికసంఖ్యలో ఘనస్వాగతం పలికారు. మాజీ ఎం ఎల్ ఏ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయనకు పూల బొకేలు , శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా కాంపెల్లి హుస్సేన్ బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు .ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డిండి మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వరరావు, డిండి టౌన్ ప్రెసిడెంట్ గిరమోని శ్రీనివాస్, నాయకులు పీర్ మహమ్మద్, పున్న లింగమయ్య గుర్రం సురేష్ ,రషీద్, జయ వర్ధన్ , ఐలేష్ చారి, బాసీద్, ఖలీల్, జైపాల్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


