తేదీ : 28/09/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ జన్మ నక్షత్రమైన , మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై దేవస్థానానికి దర్శనం కోసం ఒకటి.ఏడు ఐదు లక్షల నుంచి రెండు లక్షల వరకు వచ్చే భక్తుల కోసం సంబంధిత అధికారులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారని, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని. శివనాథ్ (చిన్ని) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల ఇరవై తొమ్మిది వ అనగా సోమవారం ఎలాంటి పాసులు కు అనుమతి లేదన్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తే సామాన్య భక్తులు సత్వరమే దర్శనం చేసుకోగలుగుతారన్నారు. నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఈ జిల్లా యంత్రాంగం, పోలీస్, దేవాదాయశాఖ సంయుక్తంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయని తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సమీక్షిస్తున్నారన్నారు. మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది, ఇంకా చందాలని కనకదుర్గ ను వేడుకున్నానన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


