World Tourism Day : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

దేవరకొండ సెప్టెంబర్ 27 త్రినేత్రం న్యూస్. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు విద్యార్థులు కలిసి దేవరకొండ ఖిల్లాను సందర్శించారు. అనంతరం అధ్యక్షుడు ఎన్ వి టీ మాట్లాడుతూ పర్యాటక స్థలాలను కాపాడుకోవాలని వాటి గురించి విద్యార్థులకు తెలియజేయాలని, యువత తెలుసుకోవాలని అన్నారు. దేవరకొండ ఖిల్లాకు ఎంతో ప్రాధాన్యత చరిత్ర ఉన్నదని.ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న జరుపుకుంటారు. 1980 నుండి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వేడుకలు నిర్వహిస్తోంది. 1970లో యు ఎన్ డబ్ల్యు టి ఓ శాసనాలు ఆమోదించబడిన రోజున ఈ తేదీని ఎంపిక చేశారు, ఇది ప్రపంచ పర్యాటక రంగంలో ఒక మైలురాయిగా భావిస్తారు.

ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం అంతర్జాతీయ సమాజంలో పర్యాటక పాత్రపై అవగాహన పెంచడం అని అన్నారు.అలాగే దేవరకొండ నియోజకవర్గంలో పర్యాటక స్థలాలు దేవరకొండ ఖిల్లా, డిండి, దేవర్ చర్ల గుడి, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, వైజాగ్ కాలనీ, బుర్ర గృహాలు, ఇంక ఎన్నో పర్యాటక స్థలాలు గల కొండ దేవరకొండ, వీటిని అభివృద్ధిలో కి తీసుకురావా లని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాల్లా శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, పి జె శాంసన్, కరాటే మాస్టర్స్ చైతన్య, గోపి, పృథ్వి, పవన్ , చంద్రశేఖర్ ,లక్ష్మణ్ ,అతి రామ్ ,యాదయ్య, రాజు, శ్రీను, మురళి, మణి క్రీడాకారులు కళాకారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

World Tourism Day celebrations

You cannot copy content of this page

Scroll to Top