తేదీ : 26/09/2025. పశ్చిమగోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్ ); జిల్లా కేంద్రమైన భీమవరం, మరియు ఏలూరు జిల్లా పట్నాలలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూపాయలు నలబై తొమ్మిది.ఐదు సున్న కోట్లు తో ట్రామా కేర్ కేంద్రాల నిర్మాణానికి ప్రాధాన్యత నిచ్చింది. అదేవిధంగా ఏలూరులో రూపాయలు ఇరువై నాలుగు.ఏడు ఐదు కోట్లు తో పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భీమవరంలో పనులు చేపట్టేందుకు ఏ పి ఎం ఎస్ ఐ డి సి కార్యచరణ చేపట్టింది.ఈ కేంద్రాలలో ప్రత్యేక ఐసీయూ, క్యాజువాలిటీ, ఎక్సరే, స్కానింగ్, ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉంటాయి. అభివృద్ధి పనులు ప్రజలకు అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


