వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ జిల్లా లొ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు దాటవద్దు .. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు దృష్ట ఎలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తమై ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, కూలీపోయే ప్రమాదంలో ఉన్న ఇండ్లలో నివసించే ప్రజలు సురక్షిత నివాసాలకు వెళ్లాలన్నారు.
ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్ళవద్దని, చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండవద్దని విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదన్నారు. వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు.
వర్షానికి రోడ్లు పాడై గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని, కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించాలని సూచించారు. వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జిల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


