Press Club : కూకట్పల్లి ప్రెస్ క్లబ్ స్థలం,భవన నిర్మాణం కొరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి వినతి పత్రం

TRINETHRAM NEWS

-మర్యాదపూర్వకంగా కలిసి అందజేసిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య,కార్యవర్గ సభ్యులు.
కూకట్పల్లి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.

కూకట్పల్లి, సెప్టెంబర్ 25 (త్రినేత్రం న్యూస్) : కూకట్పల్లి ప్రెస్ క్లబ్ స్థలం,భవన నిర్మాణం కొరకు కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య, కార్యవర్గ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ స్థలము,భవనం లేక ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా విలేకరులు ప్రెస్ మీట్లు,యూనియన్ మీటింగులు,సమస్యల గురించి చర్చించుకుందామంటే సరైన షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు.ఇక్కడ విలేకరుల ఐక్యతా లోపమో మరి ఇంకేదైన కారణమో ఇప్పటి వరకు ఏ విలేకరి ప్రెస్ క్లబ్ కొరకు ఆలోచన చేయలేదు.అలాగే విలేకరులను సంఘటితం చేయలేక పోయారని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సానుకూలంగా స్పందిస్తూ కూకట్పల్లి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు,ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.లక్ష్మి,సభ్యులు అనిల్ కిషోర్,బాలాపురం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Press Club land and building construction request letter

You cannot copy content of this page

Scroll to Top