పెద్దపల్లి, సెప్టెంబర్-25:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గురువారం పెద్దపల్లి జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్, అధ్యాపకుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26న ఒకేసారి తల్లిదండ్రుల – అధ్యాపకుల పరస్పర సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశం ద్వారా విద్యార్థుల విద్యా ప్రగతి క్రమశిక్షణ హాజరు సమగ్ర అభివృద్ధిపై చర్చలు జరుగనున్నాయని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు అధ్యాపకులు సహకారం అత్యంత కీలకమని, ఈ సమావేశాల ద్వారా విద్యా ప్రమాణాలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. తల్లిదండ్రుల అధ్యాపకుల సమావేశానికి తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రికల ద్వారా ఆహ్వానించామని, తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరై విద్యార్థులు అభ్యున్నతికి సహకారం అందించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


