Trinethram News : మంత్రి పొన్నం ప్రభాకర్, వెలిచాల రాజేందర్రావు ఘనంగా స్వాగతం పలికిన కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్లోని చైతన్యపురి లో బుధవారం రాత్రి మహాశక్తి ఆలయాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ వెలిచాల రాజేందర్రావుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిద్దరు మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెలిచాల రాజేందర్రావుకు అర్చకులు ప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి బండి సంజయ్ పొన్నం ప్రభాకర్, వెలిచాల రాజేందర్రావుకు వివరించారు. తొమ్మిది రోజులపాటు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతాయని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


