నిరుపేదలకు ఇండ్లు లేనివారికి ఎప్పుడిస్తారు ?
ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలు.
ఇండ్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ వారికేనా?
-బి ఆర్ ఎస్ పార్టీ వావిల్ కోల్ వడ్డేరగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు , ఓర్సు ముత్యాలు.
దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 23 త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ పార్టీ కొలువుదీరి రెండు సంవత్సరాల కాలం అయిన అభివృద్ధి మాత్రం శూన్యం, నిరుపేదల చిరకాల కలగానే మిగిలిందని పేదలకు ఇవ్వాల్సిన ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ వాళ్లు, ఇండ్లు ఉన్నవాళ్లే తీసుకుంటున్నారని, లేనోళ్ల పరిస్థితి ఎలా అని , ఎన్నికల ముందు ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం లేనోళ్లను పక్కన పెట్టి తమ పార్టీ వాళ్లకే ఇండ్లు కట్టబెడుతున్నారని వావిల్ కోల్ వడ్డెర గూడెం బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు అందడం లేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ గ్రామ సభ కమిటీ సభ్యులు చెప్పిన వారికే ఇల్లు కేటాయిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో నిరుపేదలు ఇండ్ల కోసం ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాధుడే లేడా ?లేడని ఆయన మండి పడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు,నాయకులు స్పందించి ఇండ్లు లేని పేదవారికి ఇండ్లు కేటాయించాలని లేదంటే ప్రజలు ముందు ముందు స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


