ఏ ఎస్ పి మౌనిక.
దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 23 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని ప్రజలు దసరా పండుగ సెలవుల సందర్భంగా తమ తమ సొంత ఊర్లకు, వేరే ప్రాంతానికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఒక ప్రకటనలో కోరారు. పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లేవారు ముందస్తుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమే సూచించారు. ఆ ప్రాంతాల్లో గ స్తీ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. తమ ఇండ్లలో విలువైన బంగారు ఆభరణాలు, మరియు డబ్బులు ఉంచుకోకుండా బ్యాంకు లాకర్లలో భద్ర పరచుకోవాలని తెలిపారు. బస్టాండ్లలో వివిధ రద్దీ ఉన్న ప్రాంతాల్లో సెల్ ఫోన్లు చిన్నపిల్లలను తప్పిపోకుండాజాగ్రత్తగా చూసుకోవాలని ఆమె హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


