Deadline for Vahana Mitra : వాహన మిత్రదారులకు వాహన మిత్ర పథకం అప్లై కు గడువు పెంచాలి

TRINETHRAM NEWS

ఆర్టీసీబస్సులలో పరిమితికి మించిన ప్రయాణికులు నియంత్రించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం
విద్యార్థులకుఉచిత బస్సు సౌకర్యాలు కల్పించాలి

త్రినేత్రం న్యూస్, కాకినాడ,సెప్టెంబర్,19: ది.న్యూ ఆటో రిక్షా ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కాకినాడ స్థానిక ఎస్బిఐ ఇంద్ర పాలెం బ్రాంచ్ వద్ద ఆటో కార్మికుల స్టాండ్ వద్ద నిరసన జరిగింది. ఈ నిరసనకు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహన మిత్రదారులందరికీ వాహన పథకం అప్లై కు గడువు పొడిగించాలని, ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేయడం లో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, సచివాలయంలో వాహన మిత్రులకు అప్లై చేయడంలో సచివాలయ సెక్రటరీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అప్లై చేయడానికి ఆలస్యం అవుతుందని ఆయన అన్నారు. కొంతమంది వాహన మిత్రులకు ఆర్ సి ఉన్న సచివాలయ లాగిన్ లో చూపించడం లేదని, 300 యూనిట్లు కరెంట్ బిల్లు దాటిన వారికి ఈ పథకం వర్తించదని, పథకాలు ఎగ్గొట్టేందుకే కుంటి సాకులు చెబుతూ ఆంక్షలు విధిస్తున్నారని ఆయన అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం కుంటి సాకులు మానుకొని అర్హులైన ప్రతి ఒక్క వాహన మిత్రదారులందరికీ వాహన మిత్ర పథకం అందేలా చొరవ చూపాలని, వాహన మిత్ర పథకం 20వేల రూపాయలు అందించాలని ఆయన అన్నారు. ఆటోలో సుమారుగా ఆరుగురు మాత్రమే ప్రయాణించాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని ఆంక్షలు విధిస్తున్న ఈ ట్రాఫిక్ పోలీస్ వారికి, ఆర్టీవో అధికారులకు పరిమితికి మించిన ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తుంటే కనిపించడం లేదా, రూల్స్ ప్రభుత్వ బస్సులకి వర్తించవా,ప్రమాదాలు జరగవా, పరిమితి కి మించిన ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్న నియంత్రించడంలో ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీవో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని,వారికి ప్రమాదాలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని, పరిమితికి మించిన ప్రయాణికులు ప్రయత్నిస్తుంటే సోజ్యం చూస్తున్న ఆర్టీసీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

మహిళలకు ప్రత్యేకంగా ఉచితంగా కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని, ఉచిత బస్సుల సమయ వేళలను నిర్ణయించాలని, అన్ని చోట్ల ప్రదర్శించేటట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు విద్యార్థులకు ఉచిత బస్సుల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తద్వారా విద్యార్థులకు మేలు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పి శ్యామ్, ఈ. ఏసు, కే సిహెచ్ నాగేశ్వరరావు, కే జోగిరాజు, టి సుధాకర్, ఏ శామ్యూల్, ఎం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

deadline for applying for the Vahana Mitra scheme

You cannot copy content of this page

Scroll to Top