Parents and Teachers Meeting : పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ :పలువురు విద్యార్థులకు బహుమతులు ప్రధానం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం రోజున ప్రధానోపాధ్యాయుడు బి శంకర్ ఆధ్వర్యంలో పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. బి శంకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకత మరియు సామార్థ్యాలు నిరూపించు కోనేందుకు తల్లిదండ్రుల,ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో బాగా (రీడింగ్) విద్యాబ్యాసం చేసిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఉత్సాహకరమైన వాతావరణానికి వేదికైంది. చిన్నారుల్లోనే కళాతృష్ణ, నైపుణ్యత,ఆసక్తి వెలికి తీసే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడమైనదని ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లోని సృజనాత్మకత నైపుణ్యత వెలుగులోకి వస్తాయని,తద్వారా వారి భవిష్యత్తు బంగారు బాట అయ్యే అవకాశం ఉందని,ఈ కార్యక్రమము తల్లిదండ్రుల ముంగిట జరగటం వాళ్ళ సంతోషానికి అవధులులేవని అని ప్రధానోపాధ్యాయులు బి శంకర్ మీడియాకు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Parents and Teachers Meeting

You cannot copy content of this page

Scroll to Top