తేదీ : 19/09/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దసరా సెలవులపై కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు ఈనెల అనగా సెప్టెంబరు ఇరువై రెండు వ తేదీ నుండి వచ్చేనెల అనగా అక్టోబరు రెండు వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ట్విట్ చేశారు. కాగా అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈనెల ఇరవై నాలుగు వ తేదీ నుంచి వచ్చేనెల రెండు వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. తాజా నిర్ణయంతో అదనంగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


