స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఈఓ
పెద్దపల్లి, సెప్టెంబర్-19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణ తో కలిసి ఈ వీసి లో పాల్గోన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్.ఐ.ఆర్ నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఓటర్ల జాబితా ను, 2025 voters జాబితా తో కంపేర్ చేసుకోవాలని ఈ రెండు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు ఎస్.ఐ.ఆర్. 2002, ప్రస్తుత ఓటరు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రోఫార్మా ప్రకారం రిపోర్టు తయారు చేయాలని, ఎస్.ఐ.ఆర్ సంబంధించి డెస్క్ వరకు సెప్టెంబర్ 24 నాటికి పూర్తి చేయాలని అన్నారు పోలింగ్ కేంద్రాల వారిగా ప్రస్తుత ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలలో పుట్టిన సంవత్సరం 1987 నుంచి 2004 మధ్యలో ఉంటే కేటగిరి సి,2004 తర్వాత ఉంటే కేటగిరి డీ కింద పరిగణించడం జరుగుతుందని అన్నారు ఎస్.ఐ.ఆర్ నిర్వహణ పై మాస్టర్ ట్రైయినర్ల ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించాలని అన్నారు. బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇటీవల ఎస్.ఐ.ఆర్ చేయడం జరిగిందని అన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ERO అధికారి, ఏఈఆర్ఓ, డిప్యూటీ తహసిల్దారులు, బి.ఎల్.ఓ సూపర్వైజర్లతో రెగ్యులర్గా సమావేశాలు నిర్వహించాలని, ప్రతిరోజు లక్ష్యాలను నిర్దేశించుకోని ఎస్.ఐ.ఆర్ చేపట్టేలా కార్యాచరణ తయారు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి. గంగయ్య, సురేష్, కలెక్టరేట్ ఈ విభాగం విజయ్, పర్యవేక్షకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


