జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 21 at 1.13.40 PM

TRINETHRAM NEWS

గొబ్బూరు గ్రామంలో పొగాకు బ్యారని దగ్ధం..

పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో రైతు వెన్న పెద్ద వెంకటేశ్వర రెడ్డి పొగాకు బ్యార్ని అగ్నికి ఆహుతి అయింది. అదును సమయంలో పంటను ఇంటికి తీసుకొచ్చి బేరని కాలుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటుచేసుకుని బ్యారని లో గల ఆకు మొత్తం బూడిద పాలైంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 4 లక్షల వరకు నష్టం జరిగినట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. బోర్డు వారి సహకరించి నష్టపరిహారం చెల్లించవలసిందిగా రైతు కోరారు. సంవత్సరం పొడవునా పెట్టుబడి పెట్టి, కష్టపడి చేతికి వచ్చిన పంట కాలిపోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

You cannot copy content of this page