Collector Koya : పోలీసు, అటవీ శాఖ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం సందర్శించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TRINETHRAM NEWS

పెద్దపల్లి, సెప్టెంబర్ -17: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువతీ యువకులకు సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మొదలగు పోస్టులకు ఎంపిక అయ్యే* విధంగా వారికి రాత పరీక్షలో శిక్షణ ఇచ్చేందుకు 220 మంది ఎస్సై, పిసి, ఎఫ్. బి .ఓ, 80 మంది అగ్నివీర్ మొత్తం 300మంది కరీంనగర్ లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు .అభ్యర్థులకు అందిస్తున్న శిక్షణ నాణ్యత, వారికి అందుతున్న వసతుల వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, అభ్యర్థులందరూ కష్టపడి రాబోయే వ్రాత పరీక్ష నోటిఫికేషన్ కి సిద్ధంగా ఉండి ఉత్తీర్ణత అయ్యే విధంగా శిక్షణ పొందాలని సూచించారు. అగ్ని వీర్ ద్వారా భారత ఆర్మీ లో ఉద్యోగాల కోసం వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులై ఫిజికల్ ఎంట్రన్స్ కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులు కూడా కష్టపడి శిక్షణ తీసుకొని అగ్ని వీర్ లో ఉద్యోగాలు సాధించాలని సూచించారు
పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ అందించాలని నిధులు ఖర్చు చేసి కరీంనగర్ లో నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. అన్నారు. మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రెగ్యులర్ గా ఫోకస్ చేసి పరీక్షలకు సిద్ధం కావడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తామని, శిక్షణలో నేర్చుకున్న క్రమశిక్షణ జీవితాంతం అభ్యర్థులు కొనసాగించాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, శిక్షణ అధ్యాపకులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం పెద్దపల్లి చే జారీ చేయనైనది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

District Collector visited the training camp

You cannot copy content of this page

Scroll to Top