Narendra Modi’s 75th Birthday : నరేంద్ర మోడీ 75వ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన మండల అధ్యక్షురాలు: ఉషారాణి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షురాలు గుత్తా ఉషారాణి ఆధ్వర్యంలో పెనుమూరు ముత్యాలమ్మ గుడి కోనేరు దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పెనుమూరు లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, పంపిణీ చేశారు. అనంతరం ఉషారాణి మాట్లాడుతూ దేశంలో జీఎస్టీ తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని చెప్పారు. ఇప్పుడు జిఎస్టి రెండు స్లాబులు చేసి పేద ప్రజలకు ఊరట కలిగించారని ఉషారాణి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పరంధామయ్య, మాజీ మండల అధ్యక్షులు, మరియు సామాజిక ఆరోగ్య కేంద్రం సభ్యుడు గుత్తా వాసుదేవ నాయుడు, ఉపాధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, బిజెపి నాయకులు శివయ్య నాయుడు, గోపాల్ నాయుడు, కిషోర్ నాయుడు, చంద్రయ్య నాయుడు, నరసింహనాయుడు, కృష్ణమ్మ, లత మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Narendra Modi's 75th birthday

You cannot copy content of this page

Scroll to Top