Minister Tummala : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి తుమ్మల ఎమ్మెల్యే జారే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి జెండా వందన కార్యక్రమం నిర్వహించి వందనం స్వీకరించారు. అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ తో ములకలపల్లి మండలం మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులో పాల్గొన్నారు. అదేవిధంగా మూకమామిడి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. దమ్మపేట మండలం గండుగులపల్లి ఏఖలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి నూతనంగా నిర్మించ తలపెట్టిన కాంపౌండ్ వాల్ స్టాఫ్ రూమ్స్ బాయ్స్ హాస్టల్ అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు.

అదే పాఠశాలకు అడ్వాంట కంపెనీ అందించిన కంప్యూటర్ ల్యాబ్ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు. పట్వారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టేబుల్ టెన్నిస్ యూనిట్ను ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా అంగన్వాడీ టీచర్లకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీవో బి రాహుల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా వైద్యాధికారిణి జయలక్ష్మి, జిల్లా పరిపాలన అధికారి విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీసీహెచ్ఓ రఘుబాబు, డీఏఓ బాబురావు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వాసం రాణి, సొసైటీ చైర్మన్ యెల్లిన రాఘవరావు రెండు మండలాల అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister Tummala MLA Jare

You cannot copy content of this page

Scroll to Top