జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోగల కట్ట రామదాసు వీధిలో వారం రోజుల క్రితం అదే వీధిలో యూనికాన్ టు వీలర్ చోరీకి గురైంది. ఈ సంఘటన మరువక ముందే ఆ వీధిలో మరొక గ్లామర్ టు వీలర్ వాహనాన్ని తెల్లవారుజామున చోరీ చేశారు. అదే వీధిలో మరికొన్ని ఇళ్ల తలుపులు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించారు. ఇంటి యజమానులు కేకలు వేయడంతో భయపడి పారిపోయారు. స్థానిక దుకాణంలో సీసీ కెమెరాల్లో బైక్ చోరీ చేసే దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇలా జరగటం వలన ఆ వీధిలో ఉన్న వారంతా భయాందోళనలో ఉన్నారు. పోలీసు దొంగలను ఎలాగైనా పట్టుకొని మాకు రక్షణ కల్పించాలని సీసీ కెమెరాల్లో ఉన్న ఆధారాలతో త్వరగా పట్టుకోవాని ఆ వీధిలో ఉన్నవారు అంటున్నారు. పోలీసులు సమాచారం అందిన వెంటనే స్పందించి వచ్చి అదృశ్యాలను ఆధారంగా తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానికులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Thieves are targeting two-wheelers

You cannot copy content of this page