గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి

TRINETHRAM NEWS

అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం

గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి

Trinethram News : ఈరోజు ఉన్నత అధికారుల ఆదేశాలకు మేరకు సందర్భంగా హిందూ, ముస్లిం మత పెద్దలు, వివిధ మండప నిర్వాహకులు అభ్యర్థనలను, సందేహాలు, తెలియజేశారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ ముందుగా వినాయక విగ్రహాల ప్రతిష్టపనకు ప్రతి ఒక్కరు ఆన్లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలి.
మండపల వద్ద నాణ్యమైన ఎలక్ట్రికల్ వైర్స్ ను వాడాలని సూచించారు అగ్ని ప్రమాద నిరోధక చర్యలు పక్కాగా అమలు చేయాలి. మండపల వద్ద సరైన పార్కింగ్ సదుపాయని ఏర్పాటు చేసుకోవాలి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగే విధంగా రోడ్లపై వినాయక మండపల ఏర్పాటు చేయకూడదు అన్నారు అత్యవసర పరిస్థితుల్లో మండపల నుండి బయటికి వెళ్లే మార్గాలను స్పష్టంగా ఏర్పాటు చేయాలి అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్, డిజేల వినియోగం పూర్తిగా నిషేధించాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వాలంటీర్లను నియమించి, వారిని పోలీసులతో సమన్వయం కలిగి ఉండేలా చూడాలి వినాయక విగ్రహాల నిమజ్జనం క్రమబద్ధంగా జరిగేలా ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలి.భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అన్నారు పోలీసులూ, నిర్వాహకులూ పరస్పర సహకారంతో కలిసి పని చేయాలి ఉత్సవాల సమయంలో ఎటువంటి మత సంబంధ విభేదాలు రాకుండా సోదరా భావంతో అన్ని పండగలు జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ పోలీసు శాఖ వారికి సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమం ఎస్ఐ రమేష్, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ganesh Navratri should be celebrated

You cannot copy content of this page

Scroll to Top