హైదరాబాద్ జిల్లా. 21 ఆగస్టు: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. విశ్వ భారతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బాధితులు చేపట్టిన శివ వుల్క్ందకార్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విశ్వభారత్ పార్టీ వ్యవస్థాపకురాలు యస్.రమాదేవి సమక్షంలో జరిగిన సమావేశంలో పార్టీ జాతీయ స్థాయి నేతలు, రాష్ట్ర స్థాయి నాయకుల సమావేశంలో పార్టీ వ్యవస్థాపకురాలు యస్.రమాదేవి చేతుల మీదగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామక పత్రాన్నిఅందజేశారు.
తదనంతరం యస్.రమాదేవి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర లో ప్రజసమస్యల పరిష్కారానికి కార్మిక,కర్షక,ఉద్యోగ,విద్యార్థి,యువత,మహిళా నిరుద్యోగుల సమస్యలపై శాంతియుత పోరాట ఉద్యమాలు,పోరాటాలు చేయాలని రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సేవకుల ఎన్నిక ఏప్పుడైనా ,ఎక్కడైనా ఎలాంటి అవకాశం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర అద్యక్షడిగా ఎన్నికైన శివ వుల్క్ందకార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో పార్టీ ని క్షేత్రాస్తాయి నుండి పటిష్టమైన నాయకత్వం నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.
ప్రజలు పార్టీ ని హక్కున చేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ,పాలకులదోపిడీ, దౌర్జన్యాలు, అక్రమాలు,అరాచకాల పై ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పై మడమ తిప్పని మాట తప్పని శాంతియుత పోరాటాలు,ఉద్యమాలు చేస్తు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తానని శివ తెలియజేశారు ప్రజా సేవా చేయడానికి ప్రార్టీ తనకు ఇచ్చిన గొప్ప అవకాశం,ఈ అవకాశం ఇచ్చిన పార్టీ వ్యవస్థాపకురాలు, జాతీయ అధ్యక్షురాలు యస్. రమాదేవి, జాతీయ రాష్ట్ర నాయకులకు పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.తెలంగాణ సాధన ఉద్యమం లో చురుగ్గా పాల్గొని కార్మిక సంక్షేమం కొరకు వివిధ దశలలో పోరాటాలు చేస్తున్న శివన్న గా పిలువబడి విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు చేపట్టినందుకు శివన్నకు తెలంగాణ సెజ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెతుకు ఉప్పలయ్య అభినందనలు మరి కృతజ్ఞతలు తెలియపరిచారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


