MLA Roshan Kumar : జంగారెడ్డిగూడెంలో పర్యటించిన డైనమిక్ శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 20/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, పట్టణంలో డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పర్యటించారు. ఆయన టౌన్ హాలు నందు జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాళ్లకు తగిన సూచనలు వివరించారు. మహిళలకు ఆహార పదార్థాలకు సంబంధించి సబ్సిడీ లోన్ గురించి తగిన సూచనలు చెప్పారు. తరువాత నూతన సొసైటీ చైర్మన్ డైరెక్టర్స్ ప్రమాణస్వీకారం మహోత్సవంలో పాల్గొని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా , రాకుండా చూసుకోవాలని, నూతనంగా ఎన్నికైన మాణికాల. నాగేశ్వరరావు, కె. దుర్గాప్రసాద్, పాతూరి. అంబేద్కర్ ల కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా లోకల్ కూటమి నాయకులు, నేను అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అనంతరం పట్టెన పాలెం లో పసుపులేటి.
చంద్రమణి దశదినకర్మ కార్యంలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ సూపర్ సిక్స్ పథకాలు అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి అందించిందని ఈ నియోజకవర్గంలో కూడా అందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dynamic MLAs visited Jangareddygudem

You cannot copy content of this page

Scroll to Top