దేవరకొండ ఆగష్టు 19 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెండ్లిపాకల కెనాల్ లో ముంపునకు గురవుతున్న రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరు అయిన నష్టపరిహారం చెక్కులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్ పంపిణీ చేసారు. పెండ్లిపాకల కెనాల్ ద్వారా భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరు అయిన నష్టపరిహారం చెక్కులను అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. భవిష్యత్ తరాలకు ఈ ప్రాజెక్టు మార్గదర్శకంగా నిలుస్తుందని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లీలా . ఇరిగేషన్ ఈ ఈ నెహ్రూ, పి ఎ సి ఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బుజ్జి లచ్చిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


