Repairs : గుంతలు మరమ్మతులు

TRINETHRAM NEWS

తేదీ : 17/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, చీరవల్లి గ్రామంలో మసీద్ సెంటర్ కు సమీపంలో భద్రాచలం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో పలు గుంతలు ఏర్పడడంతో అక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ప్రజలు ఇబ్బందులు తెలుసుకొని చీరపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంజి.

రాంబాబు, మాధవరం సర్పంచ్ సాయం. సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామస్తులు మరియు యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి ట్రాక్టర్, జెసిబి సహాయంతో రహదారి మరమ్మతులను చేపట్టారు. భద్రతా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు తమ వంతు కృషి ఎప్పుడు చేస్తూనే ఉన్నామని , ప్రమాదాలను నివారించేందుకు తగిన చర్యలను ప్రారంభించామని తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు మరియు సత్యనారాయణ అనడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్. బొమ్మన్ పాషా, నాగూర్ పాషా, సున్నం. వెంకటేష్, సయ్యద్. మున్వర్, బాడిస. దుర్గ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pothole repairs

You cannot copy content of this page

Scroll to Top