Independence Day : దీనబంధు కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 15 : స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో జాతీయ సమైక్యతను చాటాలని దీనబంధు కాలనీ సొసైటీ అధ్యక్షులు ఎం.మహేందర్ నాయక్ పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కాలనీవాసులతో కలసి మహేందర్ నాయక్ శుక్రవారం సొసైటీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహానీయుల పోరాటం, త్యాగాల ఫలితంగా బ్రిటిష్ వలస పాలకుల బానిస సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లభించిందన్నారు.

ప్రతి భారతీయుడు గుండెల నిండా దేశభక్తిని నింపుకుని జాతీయ సమైక్యతను పరిరక్షించుకునేందుకు పాటుపడాలని సూచించారు. పౌరుల్లో జాతీయ భావం మరింత పెంపొందించుకోవాలని సూచించారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలందరికీ ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి ఆవుల రాజు, వార్డ్ మెంబర్ ఎల్లం నాయుడు, మోహన్ రావు, సుహాస్, రాంబాబు, బసవరాజు, గణేష్, లింగరాజు, సదానంద్, శ్రీనివాస్, సుదర్శన్, వెంకటేష్, భాస్కర్ రావు, రాజమ్మ ప్రభృతులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Independence Day celebrations

You cannot copy content of this page

Scroll to Top