Mutyalamma : ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు నగర ప్రజలకు ఎల్లప్పుడు ఉండాలి

TRINETHRAM NEWS

తేదీ : 10/08/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రీ నేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ నగర ప్రజలకు ఎల్లప్పుడు ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కేశినేని . జానకి లక్ష్మి బోనాలు సమర్పించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చుట్టుగుంట ప్రాంతంలో ముప్ఫై ఏడు వ సంబరాల్లో ఆలయానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇరవై ఆరు వ డివిజన్ కి చెందిన కార్పొరేటర్ వల్లభనేని. రాజేశ్వరి , ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.

ఆమె మాట్లాడుతూ ఈ సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా విజయవాడ నగరం మరింతగా అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా దేవతను మొక్కుకున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒకటి,ఇరవై ఆరు డివిజన్ల క్లస్టర్ , ఇంచార్జ్ వల్లభనేని. సతీష్, ప్రెసిడెంట్ తోట. పాండు కార్యదర్శి కారంపూడి. సత్య, ఆలయ కమిటీ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

May the blessings of Mother Mutyalamma

You cannot copy content of this page

Scroll to Top