త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, మండపేట మండలం, ఇప్పనపాడు గ్రామంలో ఎంజిఎన్ఆర్ఇజియస్ నిధులు రూ.80.06 లక్షలతో నిర్మించిన సచివాలయం 1, 2 భవనాలను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, శనివారం ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక దృష్టి సారించటమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులకు సూచించారు. అనంతరం సచివాలయ గదులను పలువురితో కలసి ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే వేగుళ్ళ కు కూటమి శ్రేణులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, యువనాయకులు వేగుళ్ళ అజయ్ కుమార్, చోడె పెదకాపు, సర్పంచ్ కుంచె వీరమణి ప్రసాద్, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, మండపేట మండల టీడీపీ అధ్యక్షులు కర్రి తాతరావు, మాజీ అధ్యక్షులు యరగతపు బాబ్జి, రిమ్మలపూడి యామిని శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


