Strike : టూల్ డౌన్ సమ్మెలో పాల్గొన్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులు

TRINETHRAM NEWS

స్వతంత్ర దినోత్సవ వేడుకలలోపు పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించండి.

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాకినాడ,ఆగస్టు,09 ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ, అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆగస్టు 9వ నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా కాకినాడలో మున్సిపల్ కార్పొరేషన్ లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ, అనుబంధ సంఘం కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది.

ఈ నిరసనలకు ఈ ముఖ్యఅతిథిగా ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొన్నారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘం, నగర పాలక సంస్థ, నగర పంచాయతీలలో ఆగస్టు 9వ తేదీన ఉదయం మస్తర్ టైంలో గంటసేపు మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసనలు తెలియజేస్తూ టూల్ డౌన్ సమ్మెలో పాల్గొన్నారని, జీతాల పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని నినాదాలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. కాకినాడలో ఉన్న 14 సర్కిల్లో ఉదయం మస్తార్ సమయంలో నిరసన తెలియజేశామని ఆయన అన్నారు.

ఔట్సోర్సింగ్ లలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు,ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, అవుట్సోర్సింగ్ కార్మికులకు, స్కూల్ స్లీపర్స్, పార్కు కూలీలకు, ఆఫీస్ సిబ్బందికి కనీస వేతనాలు పెంచాలని, పర్మినెంట్ కార్మికులకు ఆరు బకాయి డీఏలు, సరెండర్ లీవులు, ఎన్కోస్మెంట్ తక్షణమే విడుదల చేయాలని, రిటైర్డ్ కార్మికులకు గ్రాడ్యుటీ విడుదల చేయాలని నిరసనలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు.

స్వతంత్ర వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని, కానీ మున్సిపల్ పాశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం స్పందించడం లేదని, వెట్టి చాకిరి బతుకులు, దుర్భరమైన జీవితాలు గడుపుతున్న పారిశుద్ధ్య కార్మికులను గుర్తించాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండటం పారిశుద్ధ్య కార్మికులే మూల కారణమని, మాదకరమైన కరోనా సైతం ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వహించాలని వారిని సన్మానించాలని, పారిశుద్ధ్య కార్మికులు వేసుకునుటకు సరైన యూనిఫాంలో లేక చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నారని, స్వతంత్ర దినోత్సవ వేడుకలలోపు వారికి కొత్త యూనిఫామ్ లు, రైన్ కోట్స్, ఎఫ్రాన్ మంజూరు చేయాలని, కాకినాడ స్మార్ట్ సిటీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా ఉందని స్మార్ట్ సిటీ తగ్గట్టు పనులు జరగడం లేదని, కాకినాడ స్పెషల్ సానిటేషన్, టాయిలెట్ కార్మికులకు సెలవులు మంజూరు చేయాలని పారిశుధ్య కార్మికుల సమస్యలపై స్పందించకపోతే కార్మికుల ఆధ్వర్యంలో ఉద్యమ పోరాటం చేపడతామని ప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, బంగారు రాజేష్, బొబ్బిలి ఈశ్వరరావు, నిమ్మకాయలు విక్కీ, మంగళగిరి ఎల్లారావు, శ్రీనివాస్, అప్పన్న, జనిపల్లి అప్పన్న, నక్క లక్ష్మణ్ తదితర సర్కిల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

the tool down strike.

You cannot copy content of this page

Scroll to Top