International Tribal Day : ప్రపంచ ఆదివాసి దినోత్సవం లో పాల్గొన్న శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 09/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, మండలం, యర్రగుంటపల్లి గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం కార్యక్రమంలో డైనమిక్ శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఆయన ఆదివాసులకు సంబంధించిన జెండా ఎగరవేసి విగ్రహాలకు పూలమాలలు వెయ్యడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆదివాసుల దినోత్సవం, రక్షాబంధన్ సందర్భంగా సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధించిన నాయకులు సమస్యల గురించి శాసనసభ్యులకు వివరించారు. తక్షణమే స్పందించి ఆ సమస్యలకు పరిష్కారం చేస్తానని భరోసా ఇచ్చారు. సోదరీమణులు రాఖీ కట్టారు. అనంతరం కాటమరెడ్డి పల్లె రోడ్డు, మెయిన్ రోడ్డు ప్రక్కన ధర్మాజీగూడెం లో యి నుగంటి సుధీర్ బాబు సహకారంతో రాజశ్రీ భోజనం, బిరియాని, కర్రీ పాయింట్, ఫ్రైడ్ రైస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సంబంధించిన లబ్ధిదారులకు అందించారు. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలపడం జరిగింది. నిరుపేద కుటుంబంగా ఉన్నటువంటి బొంతు. రమేష్ కుటుంబాన్ని గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుధీర్ బాబు దత్తత తీసుకొని సహాయ సహకారాలు అందించడం జరిగింది. పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు.
య ర్రగుంటపల్లి ఆదివాసి దినోత్సవం కార్యక్రమంలో నాగు, రాము, లక్ష్మీనారాయణ, హనుమంతురావు, బుచ్చిరాజు, వెంకటేశ్వరరావు, గోపి, వెంకటలక్ష్మి, ఉమ్మడి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధర్మాజీ గూడెంలో నూతనంగా ప్రారంభించిన హోటల్లో దినేష్ ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

World Indigenous Peoples Day

You cannot copy content of this page

Scroll to Top