Trinethram News : తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ,సావిత్రీ బాయి పూలే ఫౌండేషన్ సంయుక్తంగా ఇటీవల నిర్వహించినసదస్సులో ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ అక్కెనపల్లి లక్ష్మణా చారి బాలబంధు పురస్కారం అందుకున్న సందర్భంగా చెంగిచర్ల విశ్వకర్మ సంక్షేమ సంఘం ప్రతినిధులువారిని పూల మాల,శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం సంఘం ప్రతినిధులు బాలకార్మిక విముక్తి లో లక్ష్మణాచారి సేవలను కొనియాడారు.
స్థానిక కాలనీ వాసులు అభినందించారు. చెంగిచర్ల RTC కాలనీ ప్రేరణ బాలల వేదిక ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో విశ్వకర్మ సంఘం ప్రధానకార్యదర్శి కట్టాహరిప్రసాద్, ఉపాధ్యక్షులు వడ్ల నరసింహాచారి,కోశాధికారి శ్రీనివాసాచారి, ఉపేంద్రాచారి,స్థానిక కాలనీ ప్రముఖులు ఎస్ ఎస్.సత్యనారాయణ రెడ్డి, s.బుచ్చిరెడ్డి s.ఆంజనేయులు , ch.వెంకటయ్య,సుధాకర్ రెడ్డి.పూర్వ విద్యార్థులు యూసుఫ్ .మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


