తేదీ : 06/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, టీ. నరసాపురం మండలంలో ఉన్నటువంటి మధ్యాహ్నపు వారి గూడెం, వంద రామన్నపాలెం, బొర్రంపాలెం, సింగరాయపాలెం వల్లం పట్ల, మల్లు కుంట , వెలగపాడు మండల పరిషత్, మోడ్రన్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో మరియు కొత్తగా ఎంతమంది జాయిన్ అయ్యారో తెలపడం జరిగింది.
అదేవిధంగా ప్రభుత్వ సమయం పట్టిక ప్రకారం ప్రతిరోజు పాఠశాలలు తెలుస్తున్నామని, విద్యార్థులకు సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యావిత్ర సామాగ్రి అందించామని, విద్యార్థులకు ప్రతిరోజు సన్న బియ్యంతో కూడిన అన్నను, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు , రోజు విడిచి రోజు రాగి జావా, బెల్లం మరియు వేరుశనగ గింజలతో తయారు చేసినటువంటి చిక్కీలు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని అన్నారు.
సాయంత్రం సమయంలో ఆటలు ఆడిస్తున్నామని పేర్కొన్నారు. హాజరు కు సంబంధించి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో తల్లికి వందనం పథకం కింద రూపాయలు జమ అయ్యాయని చెప్పడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


