Distributed Uniform Dress Materials : సివిల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు యూనిఫాం డ్రెస్ మెటీరియల్స్ పంపిణీ చేసిన యాజమాన్యం

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని సివిల్ డిపార్ట్మెంట్ సెక్టార్ టూ నందు పని చేస్తున్న ఉద్యోగులకు సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు బుధవారం యూనిఫాం డ్రెస్ మెటీరియల్ ను పంపిణీ చేశారు‌. ఈ కార్యక్రమంలో సివిల్ డి.జి.ఎం వరప్రసాద్ మరియు గుర్తింపు సంఘం ఏఐటియుసి డిపార్ట్మెంట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ లు మాట్లాడుతూ యూనిఫాంని తప్పనిసరిగా ధరించి విధులకు హజరు కావాలని, క్రమశిక్షణ తో విధులు నిర్వహిస్తూ సివిల్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు తేవాలని వారు పేర్కొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్.ఇ.వసంత్ కుమార్, సూపర్వైజర్ యుగంధర్ రెడ్డి, సూపరింటెండెంట్ ప్రవీణ్, వర్క్ ఇన్స్పెక్టర్ పూజారి శ్రీనివాస్ , ఏఐటియుసి నాయకులు బిట్టి వెంకటేశ్వర్లు , అటికేటి రాజు, మేకల లింగయ్య, సమ్మయ్య, సతీష్, మహేష్, మల్చూర్, దోరగండ్ల మల్లయ్య ఇతర యూనియన్ నాయకులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

distributed uniform dress materials

You cannot copy content of this page

Scroll to Top