రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని ఇంచార్జ్ అడ్మిన్ మల్లారెడ్డి ఏసీపీ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఈరోజు రామగుండము పోలీసు కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రొ.జయశంకర్ చిత్రపటం వద్ద పూలను వుంచి తమ నివాళులను ఆర్పించారు ఈ సందర్భంగా ఇంచార్జ్ అడ్మిన్ మల్లారెడ్డి ఏసీపీ మాట్లాడుతూ సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవిత కాలం రాష్ట్ర సాధనకే త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు.
తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు 1969 తెలంగాణ ఉద్యమం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ ఉద్యమం, మలిదశ తెలంగాణా ఉద్యమం లో పాల్గొని దేశ వ్యాప్తంగా వేదికల ద్వారా తన ప్రసంగాలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి తెలియజేశారు అని తెలిపారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన స్పూర్తితో ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా మరింత మెరుగైన సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్ , ఇన్స్పెక్టర్ లు చంద్ర శేఖర్ గౌడ్, భీమేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, దామోదర్, మల్లేషం,వామన్ మూర్తి సూపరింటెండెంట్ లు ఇంద్ర సేనా రెడ్డి, సందీప్, సంధ్య, సీసీ హరీష్ సిపిఓ సిబ్బంది , వింగ్స్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


