అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఆగస్టు 07 : నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్‌పై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కే.లోకనాథంను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన చర్యను సిఐటియు అల్లూరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. బుధవారం కమిటీ అధ్యక్షుడు వీ.ఉమామహేశ్వరరావు, కార్యదర్శి బోనంగి చిన్నయ్య విడుదల చేసిన ప్రకటనలో ఇది స్పష్టం చేశారు.
ఇప్పటికే రసాయన పరిశ్రమల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఆమోదం లేకుండా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం దురుద్దేశమన్నారు. ఉద్యమిస్తున్న ప్రజలకు సిపిఎం అండగా ఉందని, అరెస్టు నేతలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


