ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడు జక్కంపూడి రామ్మోహనరావు..
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా, కార్మిక,ప్రజా సమస్యల ప్రాతిపదికగా, ఎదిగిన ప్రజానాయకుడు జక్కంపూడి. నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి ప్రథాత.. చిరస్మరణీయుడు జక్కంపూడి రామ్మోహన రావు.. కడియం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ శ్రీ స్టాలిన్, ఆధ్వర్యంలో జేగురుపాడు గ్రామంలో దివంగత నేత జక్కంపూడి రామ్మోహన రావు 72 వ జన్మదిన వేడుకలు.. దివంగత నేత,రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన రావు ఆశయాల సాధనకు తాము అంతా కృషి చేస్తామని స్టాలిన్ అన్నారు.
బుధవారం నాడు జక్కంపూడి రామ్మోహన్రావు 72వ జన్మదినం పురస్కరించుకుని గ్రామంలో నిర్వహించిన జయంతి వేడుకలో స్టాలిన్ పాల్గొన్నారు. గ్రామంలో వేపచెట్టు సెంటరు దగ్గర జక్కంపూడి రామ్మోహన రావు, విగ్రహానికి స్టాలిన్, పూల మాలలు వేసి నివాళులు అర్పించారు..ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఆకుల సుధాకర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు నాగిరెడ్డి వీర శివాజీ, పాలపర్తి ప్రకాష్ కుమార్ (పండు), పుట్టా బుజ్జి, బుడ్డిగ లక్ష్మణరావు, మారిశెట్టి నాగన్న,వెలుపల్లి సుబ్రహ్మణ్యం, బోనం రవికుమార్,శాకా కిరణ్, మోటుక మునియ్య, నాగిరెడ్డి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


