అల్లూరిజిల్లా అరకు లోయ, ఆగస్టు 06 (త్రినేత్ర న్యూస్): “గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వాలి” అనే నినాదంతో ఆదివాసి యువగళం జీపు జాతా ర్యాలీ అరకువేలి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదివాసి స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసి నిరుద్యోగుల సంఘం నేతలు ఆధ్వర్యం వహించారు.
ర్యాలీ అనంతరం మనోహరంలోని నాగులు రోడ్ల కూడలిలో జరిగిన సభకు ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి జి.బుజ్జిబాబు అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, డీఎస్సీ సాధన కమిటీ కన్వీనర్ సాగిన ధర్మన్న, నిరుద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ సత్యనారాయణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ ఇవ్వాలని, అదే మేరకు నిబంధనలను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన మెగా డీఎస్సీలో అల్లూరి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో 400 ఉపాధ్యాయ పోస్టులకు కేవలం 24 స్థానికులకే కేటాయించడాన్ని తీవ్రంగా విసిరిపోయారు.
ఆగస్టు 8న పాడేరు ఐటిడిఏలో నిర్వహించే మహాధర్నాకు ఆదివాసి యువత, నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నిరుద్యోగుల సంఘం జిల్లా ఆదివాసి స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ జిల్లా కో కన్వీనర్ భాను, నిరుద్యోగుల సంఘం జిల్లా నాయకులు, వంతల రాజం నాయుడు, ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు గాసి, అప్పలస్వామి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఐసుబాబు, గురుకులం ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు కొండబాబు, చంద్రు పడాల్ కళాశాల విద్యార్థులు నిరుద్యోగులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


