దేవరకొండ (చందంపేట ) ఆగస్టు 01 త్రినేత్రం న్యూస్. మేఘాల్ని తాకేలా ఎత్తున కొండలు,మనసు పలకరించే వనాలు జారువారే జలపాతాల హొయలు మదిని ఉప్పొంగించే మరుపురాని జ్ఞాపకాలు ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి అందాలు ప్రకృతి ఆలింగనం లో దాగి వున్న ఓ అద్భుతప్రదేశం పొగిల్ల జలపాతం.పచ్చని కొండలునడుమ పాలదారుల పరవళ్ళు త్రొక్కుతూ,పక్షుల కిలకిల రాగాలతో నిండిన ఈ వాతావరణం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. చందంపేట మండలం పోగిళ్ళ జలపాతం పర్యాటకులకు రా రమ్మని పిలుస్తుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


