అల్లూరి జిల్లా అనంతగిరి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 02 : అనంతగిరి మండలం, ఎగువశోభ పంచాయతీలలో వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగుల సమన్వయంతో సాగిన ఈ కార్యక్రమంలో ఆయన పలు గ్రామాలను సందర్శించి ప్రభుత్వ పథకాలు, మంచినీటి సమస్యలు, రోడ్లపై గ్రామస్తుల నుంచి సమాచారం సేకరించారు.
P4 వంటి పథకాలపై ఇంటింటా వెళ్లి గిరిజనులకు అవగాహన కల్పించారు. ఇటీవల అనకాపల్లి లో ఎమ్మెల్సీ నాగబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నామని, గ్రామస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని పార్టీ ఆదేశించిందని మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాంగి లక్ష్మణ్, కొర్ర రవి, మట్టం శ్యామ్, గేమేల రమేష్, ఎస్ ధర్మన్న తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


