Let’s Join Hands : చెయ్యి చెయ్యి కలుపుదాం…డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి,అనపర్తి.. వర్షాకాలంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని డెంగ్యూ నిర్మూలనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తాడి రామగుర్రెడ్డి అన్నారు.డెంగ్యూ నివారణ మాసోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పి ఎం పి అసోసియేషన్)తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, బిక్కవోలు మండలాల ఆధర్యంలో మండల అధ్యక్షులు వాసంశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన ఏరియా ఆసుపత్రి నుండి డెంగ్యూ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీని డాక్టర్ తాడి రామగుర్రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ డెంగ్యూ జ్వరం దోమ కాటువల్ల వస్తుందని దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, అలాగే ఇంటిముందు నీటి కుంటలు లేకుండా చూసుకోవాలని,దోమల ఆవాసాలను గుర్తించి,రసాయనాలు చల్లి నిర్మూలించాలని సూచించారు.ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,ఎవరికైన జ్వరం,వొళ్ళునొప్పులు ఎక్కువ ఉన్న,వొంటి పై దద్దుర్లు కనిపించిన వెంటనే దగ్గర్లో ఉన్న పీహెచ్సీలో చూపించుకోవాలని చెప్పినారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పద్మశ్రీ,డాక్టర్ తరుణ్,డాక్టర్ కోటేశ్వరి,డాక్టర్ ప్రవీణ,డాక్టర్ నిర్మలాచారి,మండల కార్యదర్శి ద్వారంపూడి సాయి రామారెడ్డి,కోశాధికారి నీలంశెట్టి శ్రీనివాస్, షేక్ సిలార్ సాహెబ్, పీ బాలసుబ్రహ్మణ్యం, ఐ శ్రీనివాస్, కేవీజీవీకే రెడ్డి, కేత సురేష్, నక్కిన రాజు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Let's join hands

You cannot copy content of this page

Scroll to Top