బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్..
దేవరకొండ జులై 30 త్రినేత్రం న్యూస్. దేవరకొండ. నియోజకవర్గం ముదిగొండ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నల్ల ప్రదీప్ మృతి చాలా బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ముదిగొండ గ్రామంలో ప్రదీప్ మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..నిరుపేద కుటుంబంలో జన్మించి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి అకాల మరణం గ్రామ ప్రజలకు తీరని లోటు అని ఆయన అన్నారు.ప్రదీప్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.ప్రదీప్ ఆత్మకు శాంతి చేకూరాలనిభగవంతుని ప్రార్థించారు.ఆయన వెంట బిఆర్ఎస్ మండల అధ్యక్షులు టీ వీ ఎన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,మాజీ ఎంపీటీసీ కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, జైహింద్ రెడ్డి, రేపానిఇద్దయ్య, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


